కిడ్నీ బాధితురాలికి 20 వేలు ఆర్థిక సాయం అందించిన బిజెపి సీనియర్ నాయకులు గుంటూరి సోమరాజు..

పయనించే సూర్యుడు మార్చి 21, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కిడ్నీల బాధితురాలు అలుగోలు సుధా కు 20వేలు ఆర్థిక సాయం అందజేసిన బిజెపి నాయకులు గుంటూరి సోమరాజు. రెండు కిడ్నీలు పాడైపోయి గత మూడు సంవత్సరాలగా డయాలసిస్ చేయించుకుంటున్న పిఠాపురం 2 వార్డుకు చెందిన సుధా.. వివరాల్లోకెళ్తే … కాకినాడ జిల్లా పిఠాపురం రెండో వార్డ్ కు చెందిన శ్రీమతి అలుగోలు సుధా (38) వీరికి ఇద్దరు కుమారులు భర్త సత్యనారాయణ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నరు భార్య సుధా కు రెండు కిడ్నీలు పోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వీరికి పి వెంకటాపురం గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు గుంటూరి సోమరాజు వైద్య నిమిత్తము 20 వేల రూపాయలు చెక్కుని తన నివాసంలో కుటుంబ సభ్యులను పిలిచి మాజీ సర్పంచ్ లు అనుసూరి తాతబ్బాయి, బావిశెట్టి శ్రీను, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్వీఎస్ రాజుల సమక్షంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరి సోమరాజు మాట్లాడుతూ ఆర్థిక సాయం కోసం వచ్చిన వారికి నా వంతు 20వేల రూపాయల చెక్కుని ఇవ్వడం జరిగిందని అన్నారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ అనసూయ తాతబ్బాయి నేను కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశామని మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో ఉంటున్న వారికి ఆర్థిక సాయం అందేలా పవన్ కళ్యాణ్ వరకు తెలియపరిచే విధంగా ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం ఎస్వీఎస్ రాజు మాట్లాడుతూ సోమరాజు ఎన్నో ఎంతోమందికి ఆర్థిక సాయం అందించారని తలుపు తట్టి అడిగితే కాదనిని మంచి మనిషి సోమరాజు అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందజేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బాలు, రాంబాబు, పెంకె కృష్ణారావు, విత్తనాలు సత్తిబాబు,గణేష్, ముత్తారావు, బావ శెట్టి సత్తిబాబు, పి వెంకటాపురం, పండూరు గ్రామస్తులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *