కొమరిపాలెంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

రూ. 75 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 21 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో సుమారు 75 లక్షల రూపాయల భారీ వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం పర్యవేక్షించారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రెయిన్లు మరియు కల్వర్టుల నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత కాలవ్యవధిలో పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. ప్రజా అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల కూటమి నాయకులు, కొమరిపాలెం గ్రామ కూటమి ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *