గవర్నమెంట్ ఆఫ్ లాంగ్వేజ్ & కల్చరలీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్వర్ణ నంది అవార్డు గ్రహీత జానపద చెక్కభజన గురువు వరికుంట్ల సాయికృష్ణ

పయనించే సూర్యుడు న్యూస్ : కడప జిల్లా సిద్ధవటం మండలం కమ్మపల్లి గ్రామం చెందిన వరికుంట్ల సాయి కృష్ణ కు చెక్క భజన అంటే ఎంతో ఇష్టము చిన్నతనంలో నుండి తల్లిదండ్రులు పోగొట్టుకొని వారి అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటూ మరో వైపు చెక్కభజన కళా ను కూడా ఇష్టముతో చెక్కభజన నేర్చుకున్నారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ దయాకర్ చేతుల మీదుగా చెక్క భజన గురువు వరికుంట్ల సాయికృష్ణ కు స్వర్ణ నంది అవార్డును ప్రధానం చేశారు చిన్నతనంలో నుండి కళ అంటే ఇష్టం ఇష్టం ఉండడంతో గ్రామీణ ప్రాంతాల లో సాంప్రదాయం ప్రాచీనమైన కళా రంగాలలో చెక్కభజన గురువు సగిలి పుల్లయ్య దగ్గర చెక్క భజన నేర్చుకొని మంచి పేరు ప్రతిష్టలు పొందారు ఎన్నో గ్రామాలలో, పట్టణాలలో, స్కూల్ లో,పాఠశాలల్లో చెక్కభజనను ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు గ్రామీణ ప్రాంతాలలో చెక్క భజన, జడ కోపూ , కోలాటం చాలా ప్రదర్శనలు చేశారు