గిరిజన అనాధ బిడ్డలకు కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.

★ జిల్లా కలెక్టర్ గారు ఐటిడి పి.ఓ తక్షణమే స్పందించాలి. ★ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.21.2026 అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకు వేలి నియోజకవర్గం,ఉకుంపేట మండలం గ్రామ పంచాయతీ,రాప గ్రామంలో గోమంగి సత్తిబాబు సుమారు 6 సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది.గోమంగి రాములమ్మ ఆరు నెలల క్రితం మరణించడంతో వీరి పిల్లలు నలుగురు అక్క చెల్లెలు అనాధగా దీనస్థితి మిగిలిపోయారు.మొదటి పాప గోమంగి అంజలి రెండో పాప గోమంగి ప్రియాంక మూడోపాప గోమంగి లావణ్య నాలుగోపాప గోమంగి జాస్మిన్ తల్లితండ్రులు కోల్పోవడంతో ఏ పని చేయాలో ఏం తినాలో దిక్కుతోశని స్థితిలో ఉన్నారు.అనాధ బిడ్డలకు ఈరోజు సీత అభి యూట్యూబ్లో ఈ సమాచారం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి మనోధైర్యాన్ని నింపి వాళ్ళకి భరోసా ధైర్యము ఇవ్వడం జరిగింది.మా వంతు మాకు కలిగిన చిరు సహాయం చేయడం జరిగింది.ఎవరైనా దాతలు నేరుగా రాప గ్రామంలో వచ్చి గిరిజన అనాధ బిడ్డలకు సహాయ సహకారాలు అందించగలరని మనవి చేస్తున్నాము.అనాధ బిడ్డలకు కూటమి రాష్ట్ర ప్రభుత్వము అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విద్య,ఇల్లు అభివృద్ధి జీవితాంతం గిరిజన బిడ్డలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు భాను సిహెచ్ రావు గంపరాయి పాల్గొన్నారు.