గిరిజన సంస్కృతికి ప్రతీక మాతృశ్రీ గండి పోశమ్మ తల్లి.

సంతాన సాఫల్య వర ప్రదాయిని గండి పోశమ్మ తల్లి. గిరిజన సంప్రదాయ పద్ధతిలో గండి పోశమ్మ తల్లి ఉత్సవాలు.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.21.2026 పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం దివి;20-03-2026 నుండి 24-03-2026 వరకు అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఉత్సవాలు ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి.సంతాన సాఫల్య వర ప్రదాయినిగా పేరుగాంచిన మాతృశ్రీ గండి పోశమ్మ తల్లి ఆశీస్సులు భక్తులు పొందాలని రంప చోడవరం ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు.దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో స్వయంభుగా వెలిసిన గండి పోశమ్మ అమ్మవారి దేవస్థానం ఉత్సవాలు శుక్రవారం ఆలయ కమిటి చైర్మన్ మలుగుల శ్రీనివాసరెడ్డి సౌజన్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి గండి వెంకటలక్ష్మి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమెకు ఆలయ ప్రతినిధులు గిరిజన సంప్రదాయ బద్దంగా హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అంగరంగ వైభవంగా గిరిజన నృత్యాలతో,గరగలాటలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆలయ కమిటి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు పట్టువస్త్రాలు సంపరించారు. శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు పురోహితులు నిర్వహించారు.వేదపండితులు ఎమ్మెల్యే దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గండి పోశమ్మ తల్లి దేవాలయం అత్యంత ప్రజాదరణ పొందిన దేవాలయమన్నారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఆలయం కాదని అంతరాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన దేవాలయమన్నారు. ఇలాంటి దేవాలయం మన గిరిజన దేవాలయంగా ఉండటం మన అదృష్టంగా భావించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టులో గోదావరి మునిగిపోయే అవకాశం ఉన్నప్పటికీ దేవాలయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రత్యేకమైన నమూనా తో దేవాలయాన్ని అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు.గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీటగా గండి పోశమ్మ తల్లి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది గిరిజనుల ఆత్మాభిమానానికి ముడిపడి ఉన్న అంశమని సగర్వంగా చెప్పుకునే చరిత్ర కలిగిన దేవాలయం ఇది అని కొనియాడారు. ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ , ఆలయ కమిటి అధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులకు సన్మానం.ఆలయ అభివృద్ధికి కృషిచేస్తున్న ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి,మరియు రంపచోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ లను ఆలయ కమిటి చైర్మన్ మలుగుల శ్రీనివాసరెడ్డి మరియు కార్యనిర్వహణ అధికారి గండి వెంకట లక్ష్మికుమార్ ల ఆధ్వర్యంలో సన్మానించారు. పోశమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ ప్రారంభోత్సవాలు సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు ఆలయ మర్యాదల చొప్పున సంప్రదాయ బద్దంగా శుక్రవారం పట్టు వస్త్రాలు అందించి అమ్మవారి ఫోటో బహుకరించారు. పోలవరం జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారిని కె.లక్ష్మీ సుధారాణి ఆధ్వర్యంలో వారికి ఘన సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.జాతర మహోత్సవాలకు రూ;1,00,000/- లు విరాళం అందించిన ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి.మాతృశ్రీ గండి పోశమ్మ తల్లి జాతర మహోత్సవాలకు.రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి రూ;1,00,000/- లు(లక్షరూపాయలు) విరాళం అందించారు. దివి:20-03-2026 నుండి 24-03-2026 వరకూ నిర్వహించే అమ్మవారి జాతర మహోత్సవాలకు ఆమె విరాళం అందజేశారు. జాతర మహోత్సవాల నిర్వహణలో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, వాడపల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కొల్లు బోయిన శ్రీనివాస్ యాదవ్, AMC చైర్మన్ లోతా లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల చంటి బాబు, ప్రధాన కార్యదర్శి గంగరాజు, సొసైటీ అధ్యక్షులు మాగాపు బాబూరావు, జిల్లా విభాగం నాయకులు మరిశెట్ల వెంకటేశ్వరరావు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు చారపు రాయుడు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కారం రామన్నదొర, తెదేపా మండల ప్రధాన కార్యదర్శి కీర్తి గంగరాజు, క్లస్టర్ ఇంచార్జ్ ముచ్చు వీర వెంకట సత్యనారాయణ, కుండ్ల చిన్న కొండారెడ్డి, గండి పోశమ్మ దేవస్థానం చైర్మన్ మలుగుల శ్రీనివాస రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ జొన్నల రాంబాబు, మాజీ మండల అధ్యక్షులు తైలం గంగాధర్ రావు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు అడబాల వీరభద్రరావు, తెలుగు యువత అధ్యక్షులు జొన్నల శ్రీనివాస కుమార్, ఐ -టీడీపి అధ్యక్షులు మద్దేటి అంజిరెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షులు శారపు రాంబాబు, కేశవరపు చంద్ర కుమార్, తెలుగు యువత కార్యదర్శి చింతల సుబ్బారావు, ఐ-టీడీపి కార్యదర్శి తాళ్లూరి కుటుంబ రెడ్డి, రేలంగి రాంబాబు, పాముగండి సర్పంచ్ కొంట్ల శివారెడ్డి, దేవీపట్నం సర్పంచ్ కుంజం రాజామణి, బూత్ ఇంచార్జ్ పుట్టపల్లి మల్లేశ్వరరావు, కామిశెట్టి శ్రీను, ఈతల శివాజీ, సిద్ధా శ్రీనివాసరావు,ఆసుపత్రి డైరెక్టర్ కోసు అచ్చిబాబు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి చవలం శివ రామకృష్ణ, యాండ్ర ఆంజనేయులు, జోగి చిన్న కాసు,కాళ్ళ సత్య రాజు, ముచ్చు త్రిమూర్తులు, ఈరేటి బ్రహ్మాజీ, కోండ్ల బొజ్జిరెడ్డి, కందికొండ గౌరీశ్వరి, సోదే అరుణ, ఈరేటి సుజాత, పోతుల వాసు, డాక్టర్ వెంకటేశ్వరరావు, తాతాజీ, చిక్కాల భూరయ్య , రంప చోడవరం మాజీ సర్పంచ్ నిరంజనీదేవి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు రాజమహేంద్ర వరం రీజనల్ జాయింట్ కమిషనర్ వి.త్రినాధరావు, విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత , కాకినాడ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్ బాబు, పోలవరం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిని కె. లక్ష్మీ సుధారాణి, తనిఖీదారు ఎస్ టి పి టి శ్రీనివాస్, గండి పోశమ్మ దేవస్థానం కార్యనిర్వహణ అధికారి గండి వెంకటలక్ష్మి కుమార్, గండి పోశమ్మ దేవస్థానం చైర్మన్ మలుగులు శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు కె.సత్యనారాయణ, పి. వెంకటేశులు, కె. వెంకట రమా, సుబ్రహ్మణ్యం, ఎస్. వెంకటేశ్వరావు, కె.కళ్యాణి, పి.పెద సత్యనారాయణ, ఎన్.బేబీ, పి భాగ్యలక్ష్మి, ఎక్స్ అఫిషియో మెంబర్ ఎస్.బాలుదొర అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.