పయనించే సూర్యుడు మార్చి 20 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలోని శ్రీ హనుమాన్ స్వామి సంస్థానంలో మార్చి 27, 2026న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు కళ్యాణ ఘట్టం జరుగుతుంది. ఈ కార్యక్రమం శ్రీ శ్రీ జనకపుత్రరాజు పీఠాధిపత్యంలో, శ్రీ దుర్గాదేవి మహారాజు పర్యవేక్షణలో జరుగుతుండగా, అయ్యప్ప స్వామి సేవా సంఘం సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం అన్నదానం, తాగునీరు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలు కల్పించారు. పరిసర గ్రామాల భక్తులు భారీ సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరుతున్నారు.