గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతా …

మంగాపురం సర్పంచ్ నాగ నరసింహారావు

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 21,తల్లాడ రిపోర్టర్ మంగాపురం గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు, కృషి చేస్తానని మంగాపురం సర్పంచ్ దుగ్గిదేవర నాగ నరసింహారావు హామీ ఇచ్చారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా బోర్లు మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రాబోయే వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలో భాగంగా బోర్లు మరమ్మతులు చేశారు. అదే విధంగా ఎన్నో రోజు నుంచి వెలగని లైట్లను పరిశీలించి, వీధిలైట్ల సమస్య పరిష్కారం చేశారు. గ్రామపంచాయ సిబ్బంది శానిటేషన్ ప్రతిరోజు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. వార్డు సభ్యులు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా వచ్చి కలవచ్చని, ఎలాంటి సమస్యనైనా తన వంతు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుజ్జర్ల పూడి చింటూ, పంచాయతీ కార్యదర్శి జొన్నలగట్ల పరశురాం, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *