పయనించే సూర్యుడు మార్చి 21 ముమ్మిడివరం ప్రతినిధి ప్రపంచంలో డాలర్ విలువ పెరగాలన్న తగ్గాలన్న “ఇటు ఆక్వా అటు సాఫ్ట్వేర్”. ఇచ్చిన హామీలను నెరవేర్చేది ఎప్పుడు. రైతుల మనుగడను దూరం చేస్తున్న దళారీ వ్యవస్థ. రైతుల నడ్డి విరుస్తున్న సిండికేట్ వ్యవస్థ 22 వ తేదీ ఆదివారం వీరవాసరం తులసి కన్వెన్షన్ హాల్లో జరిగే ఆక్వా రైతుల సదస్సుకు వేలాదిగా తరలి వెళ్తున్న రైతులు, ఉభయ గోదావరి జిల్లాల నుండి హాజరు కాబోతున్న ఆక్వా రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు అండగా ఉండవలసిన ప్రభుత్వం ఆదరణ కరువై పూర్తిగా దళారీ వ్యవస్థలో ఆక్వా వ్యవస్థ నడుస్తుం టే దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతుంటే ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీలో గాని మేతల సబ్సిడీలో గాని రాయితీలు ఇవ్వాల్సిన ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన లేక ఇటు దళారి వ్యవస్థ వలన అటు సిండికేట్ వ్యవస్థ వలన మధ్య విలవిలాడుతున్న ఆక్వా రైతులు. దళారి వ్యవస్థ నుండి ప్రభుత్వం ఈ సమస్యను పూర్తిగా తాత్సారం చేస్తుందంటూ ఆక్వా రైతులు మండిపడుతూ చేసేదేమీ లేక ప్రభుత్వం పై ఉద్యమించడానికి ఉద్యమ బాట పట్టిన ఆక్వా రైతులు.టాక్స్ లపై టాక్స్లు విధిస్తూ టన్నుకి ఇంత అని చెప్పి వసూల్ చేస్తున్న దళారీ వ్యవస్థలను రూపుమాపవలసిన ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా సిండికేట్ కు ప్రత్యక్షంగాను,పరోక్షంగాను సహకరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయంటూ మండి పడుతున్న ఆక్వా రంగం ప్రపంచంలోనే డాలర్ విలువ పెరగాలన్న పడిపోవాలన్న ఒకవైపు ఆక్వా రంగం మరోవైపు సాఫ్ట్వేర్ ఇలాంటి పరిస్థితుల్లో డాలర్ విలువ 93 రూపాయలు పెరిగితే ఏ సందర్భంలోనూ ఆక్వారంగాన్ని బలోపేతం చేయాలని గాని ఆక్వా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి దిశా నిర్దేశం లేకుండా వ్యవహరిస్తున్న తరుణంలో ఆక్వా రంగంలో రైతులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కంకణం కట్టుకున్నారు అందులో భాగంగా ఆదివారం 22వ తారీఖున వీరవాసరం తులసీ కన్వెన్షన్ హాల్లో జరగబోయే భారీ బహిరంగ ఆక్వా సభకు హాజరు కాబోతున్న వేలాది ఆక్వా రైతులు. ఉభయ గోదావరి జిల్లాలో 60,70 శాతం ఆక్వా చెరువులు ద్వారా ప్రభుత్వా నికి ఆదాయం కల్పిస్తుంటే అందులో భాగంగా ఈస్ట్ గోదావరి నుండి 25% ఆదాయాన్నిస్తున్న రైతులపై ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వం కల్పించడం ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు మనోవేదన చెందుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను పూర్తిగా ఆదుకుని రైతులకు ఇవ్వాల్సిన ఒకవైపు పవర్ సబ్సిడీ మరోవైపు మేతలపై ట్యాక్స్ తగ్గించి సబ్సిడీ వ్యవస్థలో రైతులకు పూర్తి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వానికి తెలిసేలా ఈ…చలో.. వీరవాసరం సభ విజయవంతం చేసేలాగా ఆక్వా రైతులంతా కంకణం కట్టు కుని హాజరుకావాలని విజయ వంతం చేయాలని కోరుతూ మీ త్సవటపల్లి నాగభూషణం..