చింతకాని గ్రామసభలో అభివృద్ధి పనులపై కీలక చర్చలు

పయనించే సూర్యుడు మార్చి 21, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కిలారు మనోహర్ బాబు ఆధ్వర్యంలో గ్రామసభ సమావేశం జరిగింది.గ్రామంలోని పలు సమస్యలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కిలారు మనోహర్ బాబు మాట్లాడుతూ, గ్రామంలో చేపట్టబోయే సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.గ్రామస్తుల నుంచి వివిధ సమస్యలను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధించిన తీర్మానాలను గ్రామసభలో ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోలా ఉమారాణి, గ్రామ సెక్రటరీ రమేష్ బా బు, వార్డు సభ్యులు పొనుగోటి బాబు, మాతంగి నాగరాజు, వేముల ఆకాష్, కిలారు బాబురావు, గంధసిరి లలిత, షేక్ రహీమ్ తుల్లా, జలగనబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *