పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 21 చండూర్ మున్సిపాలిటీ పరిధిలో పందుల సంచారం అధికమైందని పందుల పెంపకందారులు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పందులను జనావాసాలకు దూరంగా, నియమిత ప్రాంతాల్లో (డంపింగ్ యార్డులు లేదా వ్యవసాయ క్షేత్రాల వద్ద) పెంచాలని మరియు మురుగునీటి కాల్వలలో వదలకుండా నిబంధనలు పాటించాలని బిజెపి కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేసారు . గ్రామాల్లో వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి స్థానిక యంత్రాంగానికి సహకరించాలి అన్నారు చండూర్ మున్సిపాలిటీ పరిధిలో పందుల సంచారం అధికమైందని, పందుల సంచారంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పెంపకం దారులు చండూరు మున్సిపాలిటీ పట్టణానికి దూరాన పెంచుకునేందుకు తగు వసతులను ఏర్పాటు చేసుకోవాలని బిజెపి కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకట్ రెడ్డి పందుల పెంపకం దారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చండూరు పట్టణంలో జన నివాసాల మధ్యన పందులు సంచరిస్తూ, పలు సందర్భాల్లో అవి చనిపోయి కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయని వాటిపై వాలేటి ఈగలు ఇండ్లలో కొచ్చి వంట పాత్రలపైన వాలుతున్నాయని దీంతో ప్రజలు అనారోగ్య పాలయ్యే పరిస్థితులు దాపరించాయని తెలిపారు. మరొకపక్క పందులు పట్టణ చుట్టూరా ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తూ రైతులు వేసుకున్నటువంటి పంటలను సైతం నాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు.