పయనించే సూర్యుడు మార్చి 21 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. “125 రోజుల నిరంతర పోరాటం – ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు” పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఈరోజుతో 125వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా 125వ రోజు దీక్షను సిపిఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ సహాయ కార్యదర్శిలు యు లక్ష్మీనారాయణ కే రమేష్ కుమార్ ఏఐవైఎఫ్ మటన్ కార్యదర్శి జి అంజిత్ కుమార్ నాయకత్వంలో నిర్వహించగా, ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన ఆదోని ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సి. నరసింహులు, శ్రీరాములు, ఎన్. ఈరన్న, ఏ. శంకర్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.ఈరోజు దీక్షలో కూర్చున్న వారు: అంజి, ఏ. శంకర్, ఈరేష్, పి. శేక్షావలి, వెంకటేష్ 125 రోజుల పోరాటం – వివిధ రూపాల్లో ప్రజా ఉద్యమాలు ఈ 125 రోజుల కాలంలో ఆదోని జిల్లా సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో నిరంతర ఉద్యమాలు నిర్వహించబడ్డాయి: రిలే నిరాహార దీక్షలు (నిరంతరంగా) ర్యాలీలు, భారీ ప్రదర్శనలు ధర్నాలు, రాస్తారోకోలు ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాల సమర్పణగ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు కార్మిక సంఘాలు, వ్యాపార వర్గాల మద్దతుతో నిరసనలు విద్యార్థి, యువజన, మహిళా సంఘాల భాగస్వామ్యం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంఆటో కార్మికులకు కలిగే ప్రయోజనాలు ఆదోని జిల్లాగా ప్రకటిస్తే ఆటో డ్రైవర్లు మరియు కార్మికులకు ముఖ్యంగా ఈ క్రింది లాభాలు కలుగుతాయి:జిల్లా కేంద్రంగా మారడం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగి ఆదాయం పెరుగుతుంది కొత్త ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు ఏర్పడడంతో రోజువారీ ట్రిప్స్ పెరుగుతాయిరవాణా సదుపాయాల అభివృద్ధితో ఆటోలకు మరిన్ని రూట్లు లభిస్తాయిఆటో స్టాండ్లు, పార్కింగ్ సదుపాయాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగుపడే అవకాశం ఉంటుంది లైసెన్సులు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్ వంటి పనులు స్థానికంగా సులభంగా పూర్తవుతాయి ప్రభుత్వ పథకాలు, బీమా, సబ్సిడీలు ఆటో కార్మికులకు సులభంగా అందుబాటులోకి వస్తాయికొత్త ఉపాధి అవకాశాలతో యువత ఆటో రంగంలోకి రావడానికి అవకాశాలు పెరుగుతాయినాయకుల ప్రసంగాల ముఖ్యాంశాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు టి. వీరేష్, పి. కోదండ, వై.పి. నాగరాజ్, దాసరి గోవిందు, సుజ్ఞానమ్మ, రామలింగయ్య, రామాంజనేయులు, బాలస్వామి, సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ: ఆదోని జిల్లాగా ప్రకటిస్తే పశ్చిమ ప్రాంతం సమగ్ర అభివృద్ధి చెందుతుందివిద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి జరుగుతుందిపరిపాలన సౌలభ్యం పెరిగి ప్రజలకు సేవలు దగ్గరగా అందుతాయిఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి వలసలు తగ్గి ప్రజలు స్థానికంగా స్థిరపడతారు ప్రభుత్వానికి హెచ్చరిక ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోని జిల్లాను ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. జేఏసీ – ఆదోని జిల్లా సాధన కమిటీ.