తాతా-మనముడి చేతిలో కీలు బొమ్మలుగా మారిన ఆదోని పాలక ప్రతిపక్ష నాయకులు

పయనించేసూర్యుడు న్యూస్ మార్చి21డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని జిల్లా కోరుతూ జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 125వ రోజు రిలే నిరాహార దీక్షకు మేము సైతం అంటూ సిపిఐ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు, ఎస్ సత్తార్, అంజి, వెంకటేష్, షేక్షావలి, వీరేష్, శంకర్, దీక్షలో కూర్చోవడం జరిగింది ఆదోని జిల్లా సాధన కమిటీ జేఏసీ నాయకులు టి వీరేష్, వై పి నాగరాజ్, పగడాల కోదండ దీక్షను ప్రారంభిస్తూ వారు మాట్లాడుతూ గత 125 రోజులుగా ఆదోని జిల్లా దీక్షలు కొనసాగుతుంటే పాలక ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇంతవరకు ఖచ్చితమైన హామీ ఇప్పించకపోవడం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం పాలక ప్రతిపక్ష పార్టీ నాయకులకు భవిష్యత్తులో గ్రామ వార్డులో మీకు ఉనికి లేకుండా చేస్తాం ఎందుకంటే 150 సంవత్సరాల చరిత్ర గల ఆదోని ప్రజలను మభ్యపెట్టి మీరు ఓట్లు వేయించుకొని కోట్లు గడించుకున్నారే తప్ప ఆదోని ప్రజల గురించి ఏనాడు మీరు ఆలోచించలేదు ఒకవేళ ప్రజల గురించి మీరు ఆలోచించే వారైతే ఆదోని జిల్లా చేసి ప్రజల రుణం తీర్చుకోవాలని ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో, జేఏసీ నాయకులు, పిఎస్ వీరేష్, గుమ్మల బాలస్వామి, మదాస్ జగన్, గోవిందు, నరేష్, ఉసేనప్ప, సుభాష్ చంద్రబోస్, రామాంజనేయులు, మరియు తదితరులు పాల్గొన్నారు