తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు ఈ రోజున ఉగాది సందర్భముగా ప్రత్యేక పుష్పాలంకరణ చేయుట జరిగినది. అదేవిధముగా భక్తులు అధికసంఖ్యలో శ్రీ స్వామి వారి దర్శనం చేసుకొనియున్నారు. వారందరికీ ప్రసాదములు ఆలయ ఈవో నూతక్కి సాంబశివరావు అందజేసినారు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్ టి ఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 21 జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామములో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు ఈ రోజున ఉగాది సందర్భముగా ప్రత్యేక పుష్పాలంకరణ చేయుట జరిగినది. అదేవిధముగా భక్తులు అధికసంఖ్యలో శ్రీ స్వామి వారి దర్శనం చేసుకొనియున్నారు. వారందరికీ ప్రసాదములు మరియు అన్నప్రసాదం అన్నిటిని జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చిల్లకల్లు సబ్ ఇన్స్పెక్టర్ వార్ల సహకారముతో ఇబ్బంది లేకుండా చేయుట జరిగినది. ఈ కార్యక్రమానికి భక్తులతో కిటికీటలాడుతూ పోటెత్తిన దేవాలయం అనంతరము సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించుట జరిగినది. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమములో వేదపండితులను అర్చకులను సత్కరించటం జరిగినది అని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నూతక్కి సాంబశివరావు తెలియజేసియున్నారు