తిర్మలాపూర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు..గంగా జమునా తహజీబ్‌కు ప్రతీకగా వేడుకలు

రంజాన్ పండుగ స్నేహానికి, ఐక్యతకు నిదర్శనం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్

పయనించే సూర్యుడు మార్చి 21, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: స్నేహం, ఐక్యత మరియు సోదర భావానికి రంజాన్ పండుగ ఒక గొప్ప ప్రతీక అని రాజపూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ మండల అధ్యక్షులు , తిర్మలాపూర్ గ్రామ సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం రాజపూర్ మండలం తిర్మలాపూర్ గ్రామంలోని మసీదులో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి విందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డ గంగా జమునా తహజీబ్‌కు నిలయమని, ఇక్కడ హిందూ ముస్లింలు సోదరభావంతో పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలుపుతూ, మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో తిర్మలాపూర్ డిప్యూటీ సర్పంచ్ మంత్రి రామచందర్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు తాహేర్ పాషా, నాయకులు చుక్క మల్లయ్య, మహేందర్ రెడ్డి, ఎన్నం కుమార్, వార్డు సభ్యులు కేతవత్ సంతోష్, కేతావత్ రెడ్యా, మాజీ సర్పంచ్ కుమారుడు పెరుమాళ్ళ వెంకటేష్, కిషోర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అజమోని మల్లేష్, కావాలి శ్రీశైలం, పెరుమాళ్ళ నరసింహ, పెదిరి లక్ష్మణ్,సోహెబ్, పి. శ్రీనివాస్, అనిల్ కుమార్, ఎల్లయ్య, సోహెల్, గణేష్‌తో పాటు గ్రామస్తులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *