తెస్సా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది కవిసమ్మేళనం

పయనించే సూర్యుడు, మార్చి 21, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ టౌన్ న్యూస్,శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా దేవరకొండ లోని స్థానిక గ్రంధాలయం లొ తెలంగాణ సాహిత్య సాంస్కృతిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఘనం గా కవిసమ్మేళనం నిర్వహించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి ఉడుత సలెశ్వర్ యాదవ్ అధ్యక్షత వహించగా సామాజిక వేత్త, జాతీయ బి. సి. సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డా. చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధి గా హాజరయ్యి….శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ… కవులు రచయితలు సమాజాన్ని మార్చే గొప్ప ఆలోచనలు కల్గివుంటారని.. మార్పు ని కోరుతూ కవులు రాస్తే తర్వాతి తరం వాటిని ఉద్యమం రూపం లొ ముందుకు తీసుకెల్లి సామాజిక చైతన్యం కల్గిస్తారని.. రవిగాంచని చోట కవిగాంచుననే మాట సత్య మని అన్నారు… ఈ సందర్బంగా తెస్సా కవుల సామాజిక చైతన్యాన్ని ఆయన కొనియాడా రు.కవులు సామాజిక మార్గం దర్శకులుగా అభివర్ణించారు పెద్ద సంఖ్య లొ కవులు తమ కవితల్ని వినిపించారు.. కవులందరు ప్రపంచానికి శాంతి ని కోరుతూ పర్యావరనాన్ని ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాలి కి అదే గొప్ప పర్వదినం అని కవితల్లో వినిపించారు. ఈ వసంతం సుభిక్షం గా వుండాలని కోరారు. కవితాపఠ నం నంతరం డా. చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ కవులందరిని మెమంటో మరియు శాలువాతో ఘనంగా సత్కారించారు. ఈ కవిసమ్మేళనం లొ ప్రముఖ కవులు డా. పర్చ వాసుదేవారావు అడపాల శేకేర్ రెడ్డి లతోబాటు జానపద కవి పెంటోజీ ఉడుత సలెశ్వేర్ యాదవ్ యం. డి. రంజాన్ బేగ్ కేశవాచారి గడ్డం బిక్ష్మయ్య టైగర్ జీవ ఎం.అంజయ్య బొడ్డు వెంకటరమణ మెరుగు శ్రీను అద్దంకి శ్రీను గోవర్ధన్ కొండ్రపోల్ శ్రీను సిగ శ్రీను శివ రమేష్ లతో బాటు సాహితీ అభిమానులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *