నల్లాలకు బిరుడాలు బిగించి జాగ్రత్తలు పాటించండి

మునిసిపల్ కమిషనర్ మనోహర్

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 21 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్,మంథని మున్సిపాలిటి పరిధిలోని ప్రజలు ఇంటి నల్లాలకు బిరడాలు (అన్, ఆఫ్), నల్లా మిషన్ భగీరథ నల్లాలకు బిరడాలు (అన్, ఆఫ్) పెట్టుకుని తగు జాగ్రత్తలు పాటించాలని మంథని మునిసిపల్ కమిషనర్ మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.మీ ఇంటి నల్లాల సంపులు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఈ జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో పేరుక పోయిన నాచు,మట్టి, మురికి వల్ల నల్లాల ద్వారా మురికి నీరు,నీరు వాసన వచ్చే ప్రమాదములు ఉన్నవని సూచించారు. అలాగే త్రాగు నీరు వృధాగా పోతున్నాయని తమ దృష్టికి వచ్చిందని వేసవి కాలము దృష్టిలో ఉంచుకొని త్రాగు నీటిని పొదుపుగా వాడుకొని తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. లేని యెడల మున్సిపల్ చట్ట ప్రకారం జరిమాన విధించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.