పయనించే సూర్యుడు మార్చి 21 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక మార్చి17వ తేదీన విడుదల చేసిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఓవరాల్ 4వ ర్యాంక్ సాధించిన బర్ల అయాన్ వేదిక్ (తండ్రి: బర్ల రామకృష్ణ, తల్లి: విజయ లక్ష్మి ), గాంధీనగర్, సారపాకకు చెందిన ప్రగతి విద్యా నికేతన్ విద్యార్థి అని తెలియజేయడంలో మాకు (ప్రగతి) ఎంతో గర్వంగా ఉంది అని పాఠశాల కరెస్పాండెంట్ సానికొమ్ము చైతన్య ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమం లో కొనియాడారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైతన్య అయాన్ వేదిక్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తూ, అతని కృషిని ప్రశంసించారు. అలాగే అతని విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. అతను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసన్న అయాన్ వేదిక్‌ను కొనియాడుతూ, అతను ఎల్లప్పుడూ కృషి, పట్టుదలతో చదువులో ప్రతిభ కనబరిచే విద్యార్థి అని పేర్కొన్నారు. ఈ విజయం అతని కుటుంబానికి, పాఠశాలకు మరియు సమాజానికి గౌరవాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. నవోదయ పాఠశాలలో చదవడం గొప్ప అవకాశమని, తాను కూడా నవోదయ పాఠశాల విద్యార్థినని తన జ్ఞాపకాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా అయాన్ వేదిక్ మరియు వారి తల్లిదండ్రులను బుకే, శాలువా, మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.