నిజాం నగర్ గ్రామ సర్పంచ్ వింజమూరి శశికళ శేఖర్

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతంని మర్యాదపూర్వకంగా కలిసిన నిజాంనగర్ సర్పంచ్ వింజమూరు శశికళ శేఖర్.

పయనించే సూర్యుడు మార్చ్ 21 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండల్ నల్లగొండ జిల్లా ) తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం తన విలువైన సమయాన్ని కేటాయించి షెడ్యూల్ కులాల యువత మరియు రైతుల అభివృద్ధి కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి వాటి అమలుకై తీసుకోవాల్సిన చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా నిజాంనగర్ లోనే చదువుకున్న యువత స్వయం ఉపాధి మరియు రైతుల పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకొనుటకు ప్రీతం ప్రత్యేకంగా కొన్ని నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి కావలసిన కార్యాచరణ తయారు చేసుకోమని చెప్పడం జరిగింది. అనంతరం నిజాంనగర్ సర్పంచ్ వింజమూరు శశికళ శేఖర్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.