నిరుద్యోగులకు భరోసా ఇచ్చిన కూటమి ప్రభుత్వం

మాట నిలబెట్టుకున్న నారా లోకేష్

పయనించే సూర్యుడు న్యూస్ : మార్చ్ 21 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నెల్లూరు పార్లమెంట్ తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి, యూనిట్ ఇంచార్జ్ కమ్మ ప్రభాకర్ నాయుడు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే మెగా డీఎస్సీ, పోలీస్ నియామకాలు మరియు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే సుమారు 23 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని, దీని వల్ల ఆశించిన దానికంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయని తెలిపారు.ప్రభుత్వ రంగంలో భర్తీ చేయనున్న 10,060 ఉద్యోగాల ద్వారా వివిధ వ్యవస్థలు బలోపేతం అవుతాయని, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకం, డీఎస్సీ ద్వారా విద్యా వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని ఆయన అన్నారు.ముందుగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించడం వల్ల నిరుద్యోగులు పరీక్షలకు సన్నద్ధం కావడానికి స్పష్టమైన దిశ లభిస్తుందని, ఇది వారికి ప్రభుత్వం ఇచ్చే భరోసాగా నిలుస్తుందని కమ్మ ప్రభాకర్ నాయుడు పేర్కొన్నారు.