ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్య కాష్యపి రెడ్డి జన్మదిన వేడుకలు

* జై జవాన్ కాలనీ ఎంపీపీఎస్ స్కూల్‌లో ‘పీఎంఆర్’ సేవా దృక్పథం * విద్యార్థులకు ఉచితంగా నీటి సీసాల పంపిణీ * కీ.శే. పజ్జురి మణిపాల్ రెడ్డి ఆశయ సాధనే లక్ష్యం: మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి

పయనించే సూర్యడు / మార్చ్ 21/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ పరిధిలోని జై జవాన్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) శుక్రవారం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి కుమార్తె పజ్జురి కాష్యపి రెడ్డి జన్మదిన వేడుకలను పాఠశాల విద్యార్థుల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆడంబరాలకు పోకుండా సమాజానికి ఉపయోగపడేలా, సేవా కార్యక్రమాలతో ఈ వేడుకలను జరపడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు అండగా పీఎంఆర్ సేవా సంస్థ: ఈ సందర్భంగా పీఎంఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులందరికీ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన నీటి సీసాలను (వాటర్ బాటిల్స్) పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పజ్జురి పావని మణిపాల్ రెడ్డి తన కుమార్తె కాష్యపి రెడ్డితో కలిసి విద్యార్థులకు వీటిని అందజేశారు. వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అనంతరం పావని మణిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తన కుమార్తె పుట్టినరోజును ఇలా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం, వారికి ఉపయోగపడే వస్తువులను అందించడం ఎంతో తృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పీఎంఆర్ ప్రతినిధులు మాట్లాడుతూ.. దివంగత నేత కీ.శే. పజ్జురి మణిపాల్ రెడ్డి నిరంతరం ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా పేద విద్యార్థుల ఉన్నతి కోసం పరితపించేవారని కొనియాడారు. ఆయన ఆశయాలను, ఆశీస్సులను ముందుకు తీసుకెళ్లే బాధ్యతతోనే పీఎంఆర్ సేవా సంస్థ ద్వారా ఇలాంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు వారు వివరించారు. కాష్యపి రెడ్డి కి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పీఎంఆర్ సేవా సంస్థ ప్రతినిధులు, మట్ట రాజేశ్వర్ రెడ్డి, కరిపే ప్రవీణ్ వంజరి, పొద్దుటూరి గోవర్ధన్, నాగేశ్వర్ రెడ్డి, సింగం రాజు, సంజీవ రెడ్డి, ప్రకాష్, అరుణ్, ఉమేష్ , రాజేష్, సాయి నితీష్, రామ్, నిరుపం, సాయి, సంతోష్, సూర్య, శ్రీకాంత్, తుషార్, ప్రకాష్, అమరేందర్ రెడ్డి, డి ఎస్ రావు, ఎస్ ఎం సాహెబ్ , యాదగిరి రెడ్డి, సుబేదారెహమతుల్లా, సలీం, సుభాన్, షేక్ మహబూబ్ పేర, షేక్ దస్తగి, షేక్ జానే ఉస్మాన్, ఎం శేఖర్, స్థానిక నాయకులు, మహిళలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి పజ్జురి కుటుంబం అందిస్తున్న సహకారం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *