ప్రాధాన్యతా రంగాలకు పెద్ద పీట

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి/21 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాష్ట్ర బడ్జెట్ పై ఎమ్మెల్యే కవ్వంపల్లి వ్యాఖ్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ప్రాధాన్యతా రంగాలకు పెద్దపీట వేశారని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వ్యాఖ్యానించారు.ఈ బడ్జెట్ లో వ్యవసాయం, విద్య,విద్యుత్, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రంగం అభివృద్ధి కోసం రూ.26,674 కోట్లు కేటాయించడం సహేతుకమన్నారు.రైతుల సంక్షేమం, వ్యవసాయరంగం అభివృద్ధి కోసం ఆ శాఖకు రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలించిందన్నారు. అలాగే మరో కీలకమైన విద్యుత్ శాఖకు రూ. 21,285 కోట్లు కేటాయించడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. బీసీ సంక్షేమానికి రూ.12,511 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,934 కోట్లు , మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉదాతరతను చాటుకున్నదని డాక్టర్ కవ్వంపల్లి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించారని, అందుకే ఈ బడ్జెట్ సబ్బండవర్ణాల సంక్షేమ బడ్జెట్ గా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, రూ. 50,713 కోట్లు కేటాయించడం ద్వారా వీటి అమలుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం పటాపంచలు చేసినట్టయిందని ఆయన ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే నిర్దేశించుకున్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరిగినట్టుగా విదితమవుతోందని ఆయన పేర్కొన్నారు. మంచి బడ్జెట్ రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను డాక్టర్ కవ్వంపల్లి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *