ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచజలదినోత్సవ అవగాహనపైగోడ పత్రిక ఆవిష్కరణ

పయనించే సూర్యుడు, మార్చి 21 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార్) ఈరోజు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో హఫీజ్ పేటలో గల జల మండలి జనరల్ మేనేజర్ కార్యాలయములో ప్రపంచ జల దినో త్సవ అవగాహనపై ముద్రించిన గోడప త్రికను హైదరాబాదు మహానగర జల మండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సంతోష్ రెడ్డి, ఛీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, 15వ డివిజన్ జనరల్ మేనేజర్ రమావత్ కృష్ణగార్లు ఆవిష్క రించి తదనంతరం వారు మాట్లాడుతూ " *ఐక్యరాజ్యసమితి వారు మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవముగా ప్రకటించి ప్రతి సంవత్స రం వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతు న్నారు.ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రకృతి ప్రసాదించిన నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు, భూ గర్భ జలాలు కలుషితం కాకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సంవ త్సరం ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరపు నినాదం 'నీరుప్రహించే చోట -సమానత్వం వికసిస్తుంది_రో జురోజుకూ భూ తాపం పెరిగిపోతుంది. దానికి కారణం గ్రీన్ హౌస్ వాయు ఉద్గా రాలతో పాటు, చెట్లను ఇష్టారీతిని నరకి వేయడం, ప్లాస్టి క్ వినియోగం అధికమ వడం, ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడటం వలన,భూ గర్భ జలాలు కలుషితం అవడం వలన పర్యావరణంలో పెను మార్పులు సంభ వించి,మంచు కొండలు కరగి సముద్ర జలాలలో కలవడం వలన, సముద్రమ ట్టం పెరగడంతో పాటు వరదలు,కరువు లు, కొండచరియలు విరిగి పడడం వలన పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నా యి"అని అన్నారు."ప్రపంచ నాగరికత అంతా నదీతీర పరీ వాహక ప్రాంతాల లో నే యినుమ డించిం ది"అని అన్నా రు.భూ గోళంలో 97శాతము ఉప్పునీ రే.మిగతా 3శాతము నదులు,సర స్సులు,మంచు పర్వతాలు భూ గర్భ జలాల ద్వారా నీరు లభిస్తుంది. కేవలం నదులు,సరస్సులు మరియు భూగర్భ జలాల ద్వారా లభించే నీరు మాత్రమే త్రాగునీరు,సా గునీరు పారిశ్రా మిక విని యోగానికి ఉపయోగపడుతు న్నాయి.సకల జీవ కోటికి గాలి తరువాత నీరే ప్రధాన మయినది.చెరు వుల ద్వారా 0.86%, నదుల ద్వారా 0.02%, భూగర్భ జలాల ద్వారా 0.12% మాత్రమే నీరు లభ్యమ వుతున్నది. ఒకవైపు జనాభా పెరిగిపోవ డం,మరోవైపు భూగర్భ జలా లు రోజు రోజుకూ అడుగంటడంతో పారిశ్రామిక అవసరాలు కూడా పెరగ డంతో ప్రపం చలో 80 దేశాలు త్రాగు నీటి సమస్యత కొట్టుమిట్టాడుతున్నా యి.మానవుడు సం పూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే త్రాగే నీరు,భుజించే ఆహా రం, నివసించే ప్రదే శం వ్యక్తిగత పరి శుభ్ర త ప్రధానమైన మి.లోయ,అటవీ ప్రాంతాలలో నివసించే ప్రజలు పరిశు భ్రమైన త్రాగు నీరు లభించక అనేక వ్యాధులకు గురై సంవత్సరానికి ప్రపం చం మొత్తంలో 40 లక్షల మంది మృ త్యు వాత పడుతున్నారని అన్నా రు."ముఖ్యంగా చిన్నపిల్ల లు అతిసార వ్యాధితో బాధపడుతున్నా రు. అవన్నీ కూడా అభివృద్ధి చెందుతు న్న దేశాల లోనే జరుగుతున్నాయి.మన కు పూర్వ ము నుండి మనదే శంలో నీటి విలువ తెలుసు కాబట్టి నీటిని గంగమ్మ అని నదులు,చెరువులను,కా లువలను పూజలు పునస్కారాలతో గౌరవిస్తున్నా ము.పరిస్థితులు ఇదే విధంగా ఉంటే నీరు లేని భూమి మరు భూమి కన్నా భయంకరంగా ఉంటుంది.ఇప్పటికే మన గ్రామాలు, జిల్లాలురాష్టాల మధ్య వీటికొ రకు ఘర్షణ వాతావరణం ఏర్ప డింది. భవిష్యత్తులో నీటికోసం దేశాల మధ్య కూడా యుద్ధాలు జరిగే ప్రమాదా లు పొంచి ఉన్నాయి.మనదేశంలో ప్రతి రోజు ప్రతి వ్యక్తికి పట్టణ ప్రాంతంలో కనీసం 135 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 100 లీటర్ల నీరు అవసరం ఉంటుంది.అభి వృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలలో రోజుకు 500 లీటర్ల నీటిని వినియోగిస్తు న్నారు.భవిష్యత్తు లో అందరికి పరిశుభ్ర మైన త్రాగు,సాగు నీరు యితర పారిశ్రా మిక అవసరాలకు సరిపడా నీరు కావా లంటే నీటిని పొదు పుగా వాడటం,వాడిన నీటిని తిరిగి వ్యవ సాయానికి ఉపయోగించడంతో పాటు వ్యర్థాలను భూమిలోకి యింకకుం డా చేయాలి.అలాగే యింకుడు గుంతల ను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచాలి. చెట్లను విరివిగా పెంచాలి"అని అన్నారు."ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణతో పాటు యితర రసాయనిక పదార్థాలతో కలుషితంకా కుండా కాపా డుకోవడం వంటి చర్యలు చేపట్టాలి. ఇది ప్రభుత్వంతో పాటు పౌర సమా జం,స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి ఆచరిస్తేనే పర్యావరణ రక్షణతో పాటు సకల జనులు సంపూర్ణ ఆరోగ్య వంతు లుగా ఉంటారు"అని తెలిపా రు.ఈ సందర్భంగా అందరిచేతా నీటి సంరక్షణ ప్రతి జ్ఞను చేయించారు.ఈ కార్యక్ర మం లో జలమండలి అధికారు లు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మార బోయిన సదానంద్ యాదవ్,అమ్మయ్యచౌదరి,శివరామకృష్ణ,జీవి రావు,శివరామరెడ్డి,జనార్ధన్,ఉ మా చంద్రశేఖర్ పాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.