బీరప్ప టెంపుల్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన తోటకూర వజ్రెష్ యాదవ్

పయనించే సూర్యుడు మార్చి 21(మేడ్చల్ నియోజకవర్గం ) ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్, నాగారం డివిజన్, రాంపల్లిలో నిర్వహించిన బీరప్ప టెంపుల్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత, జట్టు స్పూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా యువత ప్రతిభ వెలుగులోకి వస్తుందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇవి దోహదపడతాయని అన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, విజయం సాధించేందుకు క్రీడాస్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నిర్వాహకులు, క్రీడాకారులు, యువకులు, అభిమానులు మరియు ప్రాంతీయ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *