భారీ గాలులు,వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, ప్రతి నష్టపోయిన రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 21 పెనుగంచిప్రోలు గ్రామంలోఇటీవల కురిసిన భారీ గాలులు, వర్షాల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను పెనుగంచిప్రోలు గ్రామంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, రైతు సంఘాల నాయకులు, కూటమి నాయకులతో కలిసి దెబ్బతిన్న అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలను పరిశీలిస్తూ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. బాధిత రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పంట నష్టం తీవ్రతపై వివరాలు అడిగి తెలుసుకొని, వారి ఆవేదనను వినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరఫున సరైన నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అధికారులను వెంటనే అప్రమత్తం చేసి, నష్టాల అంచనాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి నష్టపోయిన రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులకు అండగా నిలబడటం తమ బాధ్యత అని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం రైతులకు సహాయం అందిస్తుందని రైతులకు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల కూటమీ నాయకులు, రైతులు, రైతు సంఘం నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *