మండల ప్రజల అందరికీ రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ..ఇల్లంతకుంట మండల నూర్ భాష సంఘం అధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్..

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి/21:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలములోని ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు మహిళలకు యువకులకు ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికీ ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.వారు మాట్లాడుతూ రంజన్ మాసం రావడానికి పదకొండు నెలలు ఎదురు చూస్తూ రంజాన్ మాసం రాగానే భక్తి శ్రద్ధల తో ఉపవాస దీక్షలు తో పాటు ప్రత్యేకంగా ప్రార్థనలు ప్రతి రోజు చేయడం జరుగుతుంది.అని ఆ అల్లాహ్ ను ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని కోరుకోవడం తో పాటు అందరూ కలిసి మెలసి ఉండాలని కోరుకోవడం జరుగుతుంది అని.. .మాకు రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉన్న వారికి ఇతర కులస్తులు మరియు వివిధ పార్టీలకు చెందిన వారు మరియు మండలములోని వివిధ గ్రామాల్లో ఉన్న వారి మిత్రులు కూడా వారి వారి గ్రామాల్లో ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడం జరిగింది.అని వారు ఎలాగైతే మమ్మల్ని ప్రేమగా చూస్తూ ఉన్నారో అలాగే మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే అందరూ కలిసి మెలసి ఉండాలని కోరుకోవడం జరుగుతుంది అని నెల రోజులు ఒక్కసారిగా గడిసి పోయి సరికి కొంచెం బాధ గా ఉన్న అందరూ సంతోషంగా ఈదుల్ ఫితర్ జరుపుకోవాలని కోరడం జరిగింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *