మండల వైసీపీ ఐటి వింగ్ అధ్యక్షుడుగా గంజిహళ్లి ముల్ల రఫీ ఎన్నిక

హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన నరసింహ ఆచారి, పూర్ణ చంద్ర

పయనించే సూర్యుడు న్యూస్ 21,2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ వైసిపి జిల్లా సమన్వయకర్త మాజీ ఎంపీ బుట్టా రేణుకమ్మ, బుట్టా ఫౌండేషన్ అధినేత వైసిపి సీనియర్ నాయకులు బుట్ట నీలకంఠ, వైసిపి రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ ఆశీస్సులతో గోనెగండ్ల మండల వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడిగా గంజిహళ్లి ముల్లా మొహమ్మద్ రఫీని నియమించడం పట్ల, వర్షం వ్యక్తం చేసిన నరసింహ ఆచారి, పూర్ణచంద్ర, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైసీపీ మండల ఐటీ వింగ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం నిజంగా మా గ్రామము తరుపున గర్వకారణం అని, మీ నాయకత్వం, దూరదృష్టి, అంకితభావంతో పార్టీ మరింత బలోపేతం అవుతూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని మేము విశ్వసిస్తున్నామని ప్రజాసేవ పట్ల మీ నిబద్ధత, కృషి, నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. మీ ప్రతి అడుగు విజయవంతంగా ఉండాలని, ప్రజల ఆశీస్సులతో మీరు మరింత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నామని మీ వెంటే మేము పార్టీ పునర వైభవానికి పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, జగన్మోహన్ రెడ్డి, బుట్టా రేణుకమ్మ గెలుపు కొరకు నిరంతరం కృషి చేస్తామని,
మీ సేవలు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.