పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 21 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్.మందస రోడ్డు రైల్వే స్టేషన్లో బ్రహ్మపుర – విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ నిలుపుదల (హాల్ట్) ప్రారంభం కావడం స్థానిక ప్రజలకు గొప్ప ఊరటనిచ్చే అంశం అని కేంద్ర విమానయ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం పలాస నియోజకవర్గం మందస మండలం మందస రైల్వే స్టేషన్ వద్ద ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా విచ్చేసిన కేంద్రమంత్రి స్థానిక నాయకులు వెంకన్న చౌదరినీ మందస రైల్వే స్టేషన్ మేనేజర్ హరిగోపాల్ సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం కేంద్రమంత్రి వెంకన్న చౌదరి తో కలిసి పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు.ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, మందస పరిసర ప్రాంత ప్రజల దీర్ఘకాలిక కోరికను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో ప్రత్యేకంగా మాట్లాడి ఈ హాల్ట్‌ను మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ మందస రైల్వే స్టేషన్ స్టాపేజ్ ఉండడం వలన మందస మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు శ్రీకాకుళం, విశాఖపట్నం మరియు బ్రహ్మపుర వంటి నగరాలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది తెలిపారు.