మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన జనసేన నాయకులు మాదారపు తాతాజీ..

పయనించే సూర్యుడు మార్చి 21, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) వేసవి దాహార్తి ని తెచ్చేందుకు గత 14 సంవత్సరాలుగా వేసవి లో మూడు నెలలు పాటు మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్న మీనాక్షి రాంబాబు దంపతుల సేవలు అభినందనీయమని తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ పేర్కొన్నారు. శుక్రవారం తిమ్మాపురం జనసేన పార్టీ కార్యాలయం ఎదురుగా శ్రీ షిరిడి సాయి మందిర్ వద్ద శ్రీ సద్గురు సాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు రాంబాబు మీనాక్షి దంపతులు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని తాతాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మ గురువర్యులు మామిడిపల్లి రామారావు లక్ష్మీ దంపతుల ఆశీస్సులతో గత 14 సంవత్సరాలుగా వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మా వంతు కృషిగా మజ్జిగ, లస్సి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. తిమ్మాపురం గ్రామం లో గత రెండు సంవత్సరాలుగా చలివేంద్రంలో ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే అందుల పాఠశాలలలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఫ్రూట్ సలాడ్, కేకులు, డ్రింక్స్, పుస్తకాలు పెన్నులు అవసరమైన వారికి దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం పోలీస్ లు రమేష్, శ్రీమన్నారాయణ ,శివ విష్ణు, సుబ్బు, తోట తాగారు ప్రసన్నకుమార్ మాదాలకు తాతాజీ ట్రస్ట్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.