మా భూమిని కాపాడండి

న్యాయం చేయాలి అంటున్న బాధితులు.

పయనించే సూర్యుడు, మార్చ్ 21, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండలం అలింపురం గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని మాకు తెలియకుండా కొందరు వ్యక్తులు ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు దాసారం బాలయ్య కుమారులు దాసారం వెంకటయ్య, బాలమల్లు, కిష్టయ్య లు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి తన తండ్రికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు తమకు తెలియకుండానే ప్లాట్లు చేసి అమ్ముతున్నారని తెలియడంతో ఆ భూమి వద్దకెళ్లి అడగగా బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఉన్నత అధికారులు దీనిపై విచారణ చేపట్టి మాకు సంబంధించిన భూమిలో ప్లాట్లు విక్రయించిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు కోరారు.