
పయనించే సూర్యుడు, మార్చి 21 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పేద ముస్లింలకు అందిస్తున్న రంజాన్ కిట్ల ను శుక్రవారం గ్రామ పంచాయతీ అవరణలో గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదేశాలతో వెల్దండ గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ ముస్లిం సోదరి సోదరులు నెల రోజులు ఉపవాస దీక్షలు చేపట్టి ఈ పవిత్ర రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ఆమె సూచించారు. ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి ఏదో విధంగా అండగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను ముదిరాజ్, వార్డు మెంబర్ సభ్యులు ముదిగొండ కవిత రమేష్, కిష్టాలు, మారేపల్లి మంజుల శ్రీను, శేఖర్, వెంకటేష్, మల్లీశ్వరి రంగనాథం, నాయకులు కొయ్యల పుల్లయ్య, ఈదులపల్లి శీను, తుంగ శీను, మట్ట భరత్ గౌడ్, మైనార్టీ నాయకులు అమిద్, రషీద్, కలీం, మన్సూర్, ఖలీల్, తదితర నాయకులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇండ్లు లేని నిరుపేదల పాలిట ఒక గొప్ప వరం *సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్ వెల్దండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో వెల్దండ కేంద్రానికి చెందిన గోరటి నాగమ్మ కు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాని శుక్రవారం గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాలలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదల పాలిట ఒక గొప్ప వరం సింగిల్ విండో డైరెక్టర్ మొట్ట వెంకటేష్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను ముదిరాజ్, వార్డు మెంబర్ సభ్యులు ముదిగొండ కవిత రమేష్, శేఖర్, నాయకులు కొయ్యల పుల్లయ్య, పురుషోత్తం చారి, ఆనంద్, శ్రీనివాస్, మట్ట భరత్ గౌడ్, కొండల్, తదితరులు పాల్గొన్నారు.