యువత క్రీడల్లో ప్రతిభ కనబరచాలని పిలుపునిచ్చిన టీపీసీసీరాష్ట్ర ప్రధాన కార్యదర్శిజగదీశ్వర్ గౌడ్

పయనించే సూర్యుడు, మార్చి 21 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి క్రీడారంగ అభి వృద్ధికి ప్రత్యేక ప్రాధాన్య తనిస్తూ,రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమని,యువత క్రీడల్లో ప్రతిభ కనబరచాలని పిలుపునిచ్చారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలిం గంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఈరోజు మియాపూర్ మెట్రో గ్రౌండ్‌లో నేటి నుండి 22వ తేదీ వరకు నిర్వహించ బడనున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్స వ కార్యక్రమంలోయలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఆయన పాల్గొని, స్థానిక యువతతో కలిసి ఉత్సా హంగా క్రికెట్ ఆడుతూ వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకులు వీరేందర్ గౌడ్, కావూరి ప్రసాద్,యల మంచి ఉదయ్ కిరణ్,పట్వారీ శశిధర్, కట్ల శేఖర్ రెడ్డి,రాజధర్మరెడ్డి,రాజిరెడ్డి, బిఎస్ఎన్ సాయి,రాంచందర్ గౌడ్, వాసు,సంగమేష్,రమేష్, శ్రీనివాస్ ముదిరాజ్,బలింగ్ సురేష్ గౌడ్,సాయి యాదవ్,ప్రియదర్శిని,దివాకర్ రెడ్డి,రవి కుమార్, రత్నాచారి,శరత్,రాధాకృష్ణ, ప్రవీణ్, సతీష్,కామినేని వాసు,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.