రంజాన్ నవాజుకు ఈద్గా ఏర్పాట్లను పరిశీలించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు సీఐ గంగాధర్

పయనించే సూర్యుడు మార్చి 21 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ముస్లిం సోదరులకు అతి పవిత్రమైన ముఖ్యమైన ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగ సందర్భంగా నవాజు చదివే ఈద్గా ప్రాంతాన్ని ఆత్మకూరు సిఐ గంగాధర్ ఎస్సైలు జిలాని, సాయి ప్రసాద్ లు పరిశీలించారు. శనివారం ఇక్కడ నవాజు చదివేందుకు వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఏర్పాటును పరిశీలించారు సిఐ గంగాధర్ మరియు ఎస్సైలు జిలాని, సాయి ప్రసాద్ లు ఆత్మకూరు ప్రాంత ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈద్గా ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముస్లిం సోదరులు ఎంతో ప్రశాంత వాతావరణంలో పవిత్రంగా నవాజు చదువుకోవచ్చని అంతా సవ్యంగా ఏర్పాటు చేసి ఉన్నారని ఈద్గా పరిసర ప్రాంతాలలో మరియు పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ సిబ్బంది ముందస్తుగా బందోబస్తు నిర్వహిస్తారని సిఐ గంగాధర్ తెలిపారు.. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *