పయనించే సూర్యుడు మార్చి 21 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షల అనంతరం భక్తిశ్రదలతో నిర్వహించే రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆకాంక్షించారు. రంజాన్ పుర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లీంలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 30 రోజులు ఎంతో నిష్టతో, భక్తిశ్రద్దలతో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు చేసిన ముస్లీం సోదరులు ఎంతో సంతోషంగా జరుపుకునే రంజాన్ పండుగను కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.పండుగను పురస్కరించుకుని ఆయురారోగ్యాలు, అష్టైశ్వరాలు కలిగేలా చూడాలని ఆల్లాహ్ ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు