రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం ఘనంగా నిర్వహణ

పయనించే సూర్యుడు, 21 మార్చి 2026, భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి ,నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ పట్టణంలో శుక్రవారం రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు ప్రాంతాల నుండి స్వయంసేవకులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉగాది పర్వదిన ప్రాముఖ్యతను వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఉగాది పండుగకు ఉన్న ప్రత్యేక స్థానం గురించి వక్తలు వివరించారు. యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందించేందుకు సంఘ్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ వేడుకలో స్వయంసేవకులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, క్రమశిక్షణతో కార్య క్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. స్థానిక ప్రముఖులు, సంఘ్ నాయకులు, స్వయంసేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.