పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 21 మందమరి మండల రిపోర్టర్ బొద్దుల భూమేష్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగరేణి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను సింగరేణిలో అమలు చేయవద్దని సింగరేణి బొగ్గు బావులు సింగరేణి కే వేలం వేయకుండా కేటాయించాలని కాంట్రాక్ట్ కార్మికులకు జె బి సి సి ఐ నిర్ణయించిన వేతనాలు చెల్లించాలని ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు 130 ఏళ్ల గొప్ప చరిత్ర కలిగి న సింగరేణిలో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తి చేయగలిగిన శక్తి సామర్థ్యాలు సాంకేతిక పరిజ్ఞానం ఉందని అందువల్ల బొగ్గు గనులను అమ్మకానికి పెట్టడం మానుకొని సింగరేణి బొగ్గుగనులను సింగరేణి సంస్థకే వేలం లేకుండా అప్పగించాలని సింగరేణిలో పనిచేస్తున్న 30 వేలమంది కాంట్రాక్ట్ కార్మికుల కు జేబీసీసీఐ నిర్ణయించిన హై పవర్ వేతనాలు అమలు చేయించాలని కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ చేయాలని దేశవ్యాప్తంగా 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక కార్పొరేట్ సంస్థల అనుకూల నాలుగు లేబర్ కోడ్ లను సింగరేణిలో అమలు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను మా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపివాలని నాలుగు లేబర్ కోడ్స్ సింగరేణిలో అపరిస్కృతంగా ఉన్న కార్మిక సమస్యలు పరిష్కారమయేంత వరకు సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని ఐక్య ఉద్యమాల ద్వారానే సంఘటిత అసంఘటిత కార్మిక సమస్యలు పరిష్కరించబడతాయని సంఘటిత అసంఘటిత కార్మిక వర్గానికి రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ పిలుపునివ్వడం జరిగింది విప్లవ భినందనలతో ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్