పయనించే సూర్యుడు మార్చ్ 21 రాజేష్) దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో శుక్రవారం గొప్ప ఆధ్యాత్మిక–సామాజిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మడివేలు రజక సహకార సంఘం ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ విగ్రహ స్థాపన కోసం భూమి పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు సాకలి ఐలమ్మ చేసిన పోరాటాలు, ఆమె సామాజిక న్యా యం కోసం చేసిన త్యాగాలు, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమం గురించి వివరంగా తెలియజేశారు. ఆమె జీవిత గాథ నేటి తరాలకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల సత్తయ్య, ముత్యంపేట నరసయ్య, ముత్యాల శ్రీనివాస్, ముత్యాల కిష్టయ్య, గ్రామ సర్పంచ్ సప్న స్వామి, ఉప సర్పంచ్ తాటి సాయి, వార్డ్ మెంబర్ బొల్లం రాజేష్, కేంబసారి మల్లేష్ అశోక్ గౌడ్ . ముత్యాల రాములు. కృష్ణ. సాయిలు. సురేష్ . బాల నరసయ్య. కర్ణాకర్ . నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే పాలకవర్గ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు ద్వారా ఆమె సేవలను చిరస్థాయిగా నిలబెట్టాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తూ, సామాజిక చైతన్యానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.