ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన-ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

పయనించే సూర్యుడు ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ గేడం సందీప్ కుమార్) వాంకిడి మండలం ఖమాన గ్రామ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను సర్పంచ్ సునిత మరియు ఉప సర్పంచ్ లహూకుమార్ పరిశీలించారు. సర్పంచ్ సునిత స్వయంగా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని లబ్ధి దారులకు సూచించారు ఉప సర్పంచ్ లోబడే లహూకుమార్ పనులు నాణ్యమైన ఇల్లుగా సమయానికి పూర్తవ్వడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సర్పంచ్ సునిత పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తించారు. ఈ పరిశీలన ద్వారా ఖమాన గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం సకాలంలో పూర్తయ్యేల చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.