ఇది మహిళల ఆస్తి హక్కు సమస్యగానే భావించాలి.

★ జగన్ రెడ్డి కుటుంబ సమస్య కాదు. ★ ఎమ్మెల్యే,రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 22.2026 మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల పంపకాలను కేవలం కుటుంబ సమస్యగా. కాకుండా మహిళల ఆస్తిహక్కు సమస్యగా భావించాల్సిన అవశ్యతక ఉందని. రంప చోడవరం ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రకటనలో ఆమె ఇలా ప్రస్తావించారు.1.జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్సార్ పాలనలో రూ.43 వేల కోట్లు కలిగిన జగన్.చట్ట ప్రకారం తల్లి, చెల్లికి రెండు భాగాలు ఎందుకు ఇవ్వటం లేదు. 2.తమ ఆస్తి హక్కుకు రక్షణ ఉండాలంటే మహిళా లోకం జగన్ ను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. 3.జగన్ ను ఆవహించి ఉన్న ధన పిశాచాన్ని.వదలగొట్టకపోతే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉంటుందా?అని ప్రశ్నించారు.4.ఉచ్చ నీచాలు మరిచిన ధన పిశాచికి రాజకీయాల్లో ఉండేందుకు అర్హుత లేదన్నారు.5.సునీతకు అండగా నిలిచి మహిళల ధన,మాన,ప్రాణాల్ని,ఆస్తి హక్కులను రక్షించుకోవాలని కోరారు.6.తల్లివి, చెల్లిని గౌరవించే భారతీయ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.7.స్వంత చెల్లికన్నా బాబాయ్ ని నరికి నరికి చంపించిన అవినాష్ ఎందుకు ఎక్కువ అయ్యాడు?ఒకసారి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.8.రక్తపు మడుగును క్లీన్ చేయించి సాక్ష్యాధారాల్ని అవినాష్ ఎందుకు ధ్వంసం చేయించాడో,9.సాక్షాధారాలను ధ్వంసం చేయడం ఐపిసి 301 ప్రకారం హత్యానేరంతో సమానం అని ఎంపీకి తెలియాదా?అని మండిపడ్డారు.10.అవినాష్ ను రక్షించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ఫోన్ల గుట్టు రట్టు చేస్తాడని భయమా? అని ప్రశ్నించారు. 11.టీడీపీ బూచి చూపి ప్రజల్ని ఎల్లకాలం మోసం చేయడము సాధ్యమయ్యే పనికాదని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 12.న్యాయస్థుడైతే చెల్లెళ్లు పరాయి గడప ఎందుకు తొక్కుతారు? అని ప్రశ్న సంధించారు .13.ఎవరైనా సరే బాధిత మహిళలకు అండగా నిలిచిన చరిత్ర టీడీపీదే అన్నారు.14.ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సొంత కేసులు, అక్రమ ఆస్తుల కోసం తాకట్టు పెట్టిన చరిత్ర జగన్ ది కాదా?అన్నారు. 15. తల్లికి, చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తాడో అర్థం కావడం లేదన్నారు. 2004 లో తన ఆస్తి రూ.1.74 కోట్లు అని జగన్ ఆదాయపు పన్ను శాఖకు చూపించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.43 వేల కోట్లు అక్రమార్జన చేశాడని. సీబీఐ న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తన పాలనలో ఒక్క మద్యం కుంభకోణంలోనే రూ.3,500 కోట్ల అక్రమార్జన చేసినట్టు సిట్ నిర్ధారించింది. విషపూరిత మద్యం వల్ల 30 వేల మంది మహిళల మాంగళ్యాలు మంటగలిసాయి. తన పాలనలో ల్యాండ్, వైన్, మైనింగ్, గంజాయి, డ్రగ్స్ మాఫీయా ద్వారా వేల కోట్లు అక్రమార్జన చేశారు. అతి తక్కువ కాలంలో లక్షల కోట్ల ఆస్తులకు జగన్ అధిపతి ఎలా అయ్యారు? న్యాయంగా సంపాదించడం తప్పు కాదు. కానీ ఆర్థిక ఉగ్రవాది, టెర్రరిస్ట్ కన్నా ప్రమాదం అని న్యాయ కోవిదులు చెప్పారు. ధనార్జన తప్పు కాదు.కానీ ధన పిశాచం సమాజాన్నే అల్లకల్లోలం చేస్తుంది. జగన్ ధన పిశాచి అయ్యాడు. తన పాలన ఘోరాలు, నేరాల మయం అయింది. ఇలాంటి వారికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉన్నదా ప్రజలు ఆలోచించాలి. కుల, మత ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టి కుతంత్రపు వాదనలతో ప్రజలను మోసం చేస్తున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లి చెప్పింది తప్పు అంట. చెల్లెళ్లు చెబుతున్నది తప్పంట. సీబీఐ ఛార్జ్ షీట్ తప్పంట. ప్రతిపక్షాలు చెప్పేవన్ని కూడా తప్పంట. తన నేరాలు, ఘోరాలకు 11 సీట్లకే పరిమితం చేసిన ప్రజలది కూడా తప్పంట. జగన్, అవినాష్ చెప్పేదే నిజం అని ప్రజలు నమ్మాలంట. ప్రజల విజ్ఞత పట్ల జగన్కు ఎంత చులకన భావన ఉందో ఈ ధోరణి రుజువు చేస్తోంది.ఊరంత ఒకదారి అయితే ఉలిపికట్టుది మరోకదారి అన్న చందంగా జగన్ సైకో ముఠా తీరు లేదా?హత్యారాజకీయాలకు వ్యతిరేకంగా, శాంతియుత పులివెందుల కోసం, ఒంటరిగా ధైర్యంగా న్యాయపోరాటం చేస్తున్న డాక్టర్ సునీతకు మహిళా లోకం, ప్రజాస్వామ్య వాదులు, ప్రజలు అండగా నిలవాలి. నేరస్థుల్ని చట్టం ముందు నిలబెట్టాలి. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలు, ఆస్తులను కాపాడుకోవాలని ఆమె కోరారు.