పయనించే సూర్యుడు మార్చి 22, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) పట్టణ ,నగరవాసులకు సొంత ఇల్లు నిర్మాణానికి రూ.2.50 లక్షలు ఇస్తున్న విధంగా గ్రామీణ ప్రాంతాలకు ఆ స్థాయిలో సాయం అందించాలని ఇటీవల జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ ప్రస్తావించడం జరిగిందని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం రూ.2.39 లక్షలకు పెంచడం హర్షనీయమని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడారు .జీవితంలో ఆర్థిక భద్రత ,సామాజిక స్థాయి పెరుగుదలకు సొంత ఇల్లు ముఖ్యమైన భావంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం గృహాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. దేశంలో మొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. 2017- 19 మధ్యకాలంలో ఇప్పటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార్ట్మెంట్లు నిర్మించారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పేద, మధ్యతరగతి ప్రజల ఆశల్లో సొంత ఇల్లు అత్యంత ప్రధానమైనదని గుర్తించి దేశవ్యాప్తంగా' ప్రధానమంత్రి ఆవాస్ యోజన' పథకం కింద పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణానికి రూ. లక్ష యాభై తొమ్మిది వేలు కేటాయిస్తున్నాయని ఇకనుండి ఒక్కొక్క ఇంటికి రూ. 2. 39 లక్షలు లభించనున్నాయని అన్నారు. పేదల ఇల్ల నిర్మాణ చరిత్రలో ఈ స్థాయిలో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం ఇదే తొలిసారి అని అన్నారు. రాష్ట్రంలో అందరికీ ఇల్లు కట్టిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2026- 27 రాష్ట్ర బడ్జెట్లో రూ. 6,357 కోట్లు కేటాయించిందని అడబాల తెలిపారు.