పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 22 బోధన్ : ప్రభుత్వ శనగ కొనుగోలు కేంద్రాన్ని మార్క్ ఫెడ్,నా ఫెడ్ నేతృత్వంలో కల్దుర్కీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం శనగ కొనుగోలు కేంద్రాన్ని పిసిసి డెలిగేట్ గంగా శంకర్,బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్,వైస్ చైర్మన్ వసంత రెడ్డి,సొసైటీ అధికారులు ప్రారంభించారు.క్వింటాలుకు 5875 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించినట్లు సొసైటీ సీఈవో స్పష్టం చేశారు.ఎకరానికి 8 క్వింటాళ్ల శనగ పంటను కొనుగోలు చేయనున్నట్లు సీఈఓ వెల్లడించారు.సిబ్బందికి సహకరిస్తూ సమన్వయంతో రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా శనగ పంటను విక్రయించాలని పిసిసి డెలిగేట్ గంగా శంకర్ సూచించారు.ఎకరానికి 8 క్వింటాళ్ల పంట కొనుగోలు నిబంధనలు సడలించి రైతు పండించిన మొత్తం పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు నాయకులు మరియు అధికారులను కోరారు.ప్రభుత్వ పెద్దలు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ పటేల్,గణపతి రెడ్డి,గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి,గ్రామ పెద్దలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.