పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 22,తల్లాడ రిపోర్టర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమితులైన తల్లాడ సీనియర్ నాయకులు కేతేపల్లి భాస్కర్ రావును ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దుండేటి వీరారెడ్డి, వడ్డే రామారావు శాలువాలతో సన్మానించి సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు పార్టీని నమ్ముకున్న సీనియర్ నేతకు ఈ పదవి రావటం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగళ్ల శ్రీనివాసరావు, నారపోగు ప్రసాదు, కాంపాటి రవి, నాగేశ్వరావు పాల్గన్నారు.