కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

* అధికారికి వినతి పత్రం అందించిన ఉడుత శంకర్ యాదవ్.

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటనరీకాలనీ -22 ఆర్జీ-3 ఏరియాలోని ఏ.ఎల్.పి. మైన్ జెన్కో కంపెనీ సబ్ కాంట్రాక్టు బివిసి సెక్యూరిటీ గార్డ్స్, ఇతర కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మూడు నెలలుగా ఇవ్వనటువంటి జీతాల పైన ఈపీఎఫ్ సమస్య పైన సంవత్సరానికి ఒకసారి పెంచేటువంటి జీతాల పైన జెంకో ఆఫీస్ ముందు ఐఎన్టీయూసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిఎం ఆఫీస్ లో పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్.జి త్రీ ఏరియా ఇన్చార్జ్ మబ్బు శంకర్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఉడుత శంకర్ యాదవ్, రీజియన్ సెక్రెటరీ బండ కిరణ్ రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *