కారుకొండ, వట్టెం గ్రామాల్లో ఘనంగా ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహప్రవేశం

కార్యక్రమంలో ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 22 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం కారుకొండ, వట్టెం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గృహప్రవేశం అనంతరం లబ్ధిదారులతో ముచ్చటించిన ఆయన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, బిజినపల్లి మండల అధ్యక్షులు మిద్దె రాములు సేవా దళ్ అధ్యక్షులు విద్య మల్లేష్ మాజీ సర్పంచ్ బాలరాజ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసు గంటి శ్రీనివాస్ గౌడ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టిన లబ్ధిదారులు ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *