కోమటిరెడ్డి సోదరులపై విమర్శలు సహించం: మునుగోడు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

* కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క దూరదృష్టి కి ప్రతిరూపమే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు . * ముప్పా వంతు పూర్తి చేసినప్పటికీ 10 సంవత్సరంలో అధికారంలో ఉండి వెలగబెట్టిన టిఆర్ఎస్ ఒక్క పైసా కూడా ఇవ్వలేని స్థితి. * బ్రాహ్మణ వెల్లంల ప్రధాన ఎడమ కాలువ ఉరుమడ్ల వరకే ఉంటే... దానిని కిష్టాపురం వరకు 12.5 కిలోమీటర్లు విస్తరించింది రాజగోపాల్ రెడ్డి . *కబ్జా కోరల్లో ఉన్న ఇరవై ఎకరాల భూమిని కాపాడి పేద పిల్లల నాణ్యమైన చదువు కోసం మునుగోడులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రూట్ క్లియర్ చేశారు. *మునుగోడు లో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు .

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు 22. ఈమధ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన కోమటిరెడ్డి బ్రదర్స్ పైన అవాకులు చవాకులు పేలుతూ కారు కూతలు కూస్తున్నారు. ఆ కారు కూతలు కూసే వారు ఇన్నాళ్లు చేయలేదు చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. మునుగోడు నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉన్నది అని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని కండ్లుండి చూడలేని స్థితిలో ఉన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క దూరదృష్టి కి ప్రతిరూపమే బ్రాహ్మణ వెల్లంల నీటిపారుదల ప్రాజెక్టు.. వైయస్సార్ హయాంలోని ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి ముప్పా వంతు పూర్తి చేసినప్పటికీ 10 సంవత్సరంలో అధికారంలో ఉండి వెలగబెట్టిన టిఆర్ఎస్ ఒక్క పైసా కూడా ఇవ్వలేని స్థితి. తరువాత ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణవెళ్లిన ప్రాజెక్టును పూర్తి చేసి నీరందిస్తుంటే విషయ పరిజ్ఞానం లేని కొంతమంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు బ్రాహ్మణ వెల్లంల ప్రధాన ఎడమ కాలువ ఉరుమడ్ల వరకే ఉంటే దానిని కిష్టాపురం వరకు 12.5 కిలోమీటర్లు విస్తరించింది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి . గత వేసవిలో పంటలు ఎండిపోతుంటే 10 లక్షల రూపాయలు తన సొంత నిధులతో కిలోమీటర్ మేర కాలువ తవ్వించి పులి పలుకుల చెరువులకు నీళ్లు వచ్చేలా చేసింది రాజగోపాల్ రెడ్డి . బ్రాహ్మణ వెళ్ళాం ల ప్రాజెక్టు నుంచి మునుగోడు మండలంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించాలని దృఢ సంకల్పంతో రిటైర్డ్ ఇంజనీర్లతోటి ఎన్నోమార్లు సమీక్షలు జరిపి ప్రభుత్వంతో మాట్లాడి డిపిఆర్ సిద్ధం చేస్తున్న ప్రయత్నం టిఆర్ఎస్ వాళ్లకు కనిపించడం లేదు కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతే జాగ్రత్త ఖబడ్దార్ . ఏదో మైకు ఉందిగా అని చేతిలో సెల్ ఉంది గా అని విషయ పరిజ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. మునుగోడు అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పైన మాట్లాడే ముందు నిజా నిజాలు తెలుసుకోవాలి.. లేదు అలాగే మాట్లాడతా అంటే మాత్రం ఒక్కొక్కరి నాలుక చీరేస్తాం జాగ్రత్త ఖబడ్దార్ అని హెచ్చరించారు. గతంలో 10 సంవత్సరాల టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి విషయంలో ఏం చేస్తున్నారనే దానిపై చర్చిద్దాం.. కమిషన్ల కోసం పేదల భూములు లాక్కొని శివన్నగూడెం, కిసరాంపల్లి కట్టలు కట్టిన తెలంగాణ మేధావి తెలంగాణలో గొప్ప ఇంజనీరు కెసిఆర్ కి ఆ రిజర్వాయర్లకు ఎక్కడినుండి నీరు తీసుకురావాలని ఆలోచన కూడా చేయక పోతే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి ఏదుల రిజర్వాయర్ నుండి నీటి తరలింపు కోసం 1800 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చారు. కెసిఆర్ ని ప్రశ్నించలేని దద్దమ్మ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శివన్నగూడెం కిసరాంపల్లి భూనిర్వాసితులకు డబ్బులు ఇప్పియ్యలేని చేతగాని వ్యక్తి ఇప్పుడు ఏదుల రిజర్వాయర్ నీటిమట్టం స్థాయి గురించి మాట్లాడుతున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే దయ్యాలే వేదాలు వలిచినట్లుంది ఏదుల రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం పై అటు ముఖ్యమంత్రి తోటి ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి తోటి మాట్లాడుతూ దేవరకొండ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే అవసరమైతే రాజీనామా చేస్తానని హెచ్చరించి మరి పనులు చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ… విషయ పరిజ్ఞానం లేకుండా కెసిఆర్ మోచేతి నీళ్లు దాచుకుంటూ ఆయనకు భయపడుతూ మాట్లాడుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్థాయి ఎక్కడ తెలుసుకొని మాట్లాడండి . ఒక మునుగోడు మండలమే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సాగునీటి సౌకర్యం అందించడానికి అనునిత్యం రిటైర్డ్ ఇంజనీర్లతోటి అధికారులతోటి ప్రభుత్వం తోటి చర్చలు జరుపుతున్న రాజగోపాల్ రెడ్డి పైన మాట్లాడడం మీ అవివేకం. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో కబ్జా కోరల్లో ఉన్న ఇరవై ఎకరాల భూమిని కాపాడి పేద పిల్లల నాణ్యమైన చదువు కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రూట్ క్లియర్ చేశారు. తన సొంత నిధులు కోటిన్నర రూపాయలు పెట్టి మర్రిగూడెం కస్తూరిబా పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు. మునుగోడు నియోజకవర్గంలో కంటి సమస్యతో ఏ ఒక్కరు బాధ పడొద్దనే ఉద్దేశంతో తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కొత్త పేదల కండ్లలో కొత్త వెలుగులు తీసుకొస్తున్నారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఏమి చేయలేకపోతున్నాననె ఉద్దేశంతో తన పదవిని త్యాగం చేసి ప్రభుత్వాన్ని మునుగోడు నియోజకవర్గ ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన గొప్ప త్యాగశీలి ధైర్యవంతుడు దీశాలి రాజ్ గోపాల్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏరోజు భూకబ్జాలు గాని అవినీతి గాని చేయకుండా తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోటే సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది పేదలకు ప్రాణదాతగా నిలిచాడు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వ్యవస్థలను మార్చాలని సంకల్పంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి బెల్ట్ షాపులు నిర్మూలించి ఎంతోమంది మహిళల సంసారంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించిన ఘనత రాజగోపాల్ రెడ్డి ది రాజగోపాల్ రెడ్డి నిర్ణయాలు రాజగోపాల్ రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకతీతంగా మెచ్చుకుంటుంటే ఒళ్ళు బలిసి ఎంగిలి పావులకు ఆశపడిన కొందరు బ్రోకర్ గార్లు తమ పార్టీ అధినేతల మెప్పు పొందడానికి చేస్తున్న నిరాధార ఆరోపణలు ఇకపై రాజగోపాల్ రెడ్డి పైన అవాకులు చవాకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తే ప్రజలు ఊరుకోరు మిమ్మల్ని ఉరికించి కొట్టే సమయం వస్తుంది.. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు పోరంబోకుల మాటలు మాట్లాడుతున్నారని ప్రజల గమనిస్తున్నారు రేపు వారే మీకు సరైన బుద్ధి చెబుతారు. ఈ కార్యక్రమంలో చండూరు మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి. మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు..సర్పంచులు. రామలింగయ్య.జాల జగన్. దాసరి గోవర్ధన్. బాబు. గోపగోని పాపయ్య. కదిరి లింగయ్య. ఖమ్మం పార్టీ జ్యోతి వెంకటేశ్వర్లు. జక్కలి రేణుక మహేష్ .మాజీ ఎంపీటీసీ పందుల భాస్కర్ . జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పాల్వాయి జితేందర్ రెడ్డి.మాజీ సర్పంచులు జాల వెంకన్న. నడుంపల్లి యాదగిరి.మిర్యాల వెంకన్న. మాధగోని రాజేష్ గౌడ్. నకిరికంటి యాదయ్య. మాధగోని దేవలోకం. వరికుప్పల వెంకన్న పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *