గొల్లగూడ లో ఉప సర్పంచ్ లోబడే లాహు కుమార్ ఆధ్వర్యంలో గుంతల పూడ్చివేత.

పయనించే సూర్యుడు న్యూస్, మార్చ్ 22, 2026,ఖమాన, వాంకిడి, కొమరం భీమ్, ఝాడే భక్త రాజ్, ప్రతినిధి. వాంకిడి మండలం ఖమాన గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లగూడ ప్రజలు ఇటీవల రోడ్లపై గుంతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు కష్టంగా మారాయి. ఈ సమస్య గురించి తెలుసుకున్న గ్రామ ఉప సర్పంచ్ లోబడే లాహు కుమార్ వెంటనే స్పందించారు. గుంతలు ఉన్న విషయాన్ని గుర్తించిన ఆయన, తక్షణ చర్యలు చేపట్టి ఇసుక వేయించి గుంతలను పూడ్చే పనులు నిర్వహించారు. దీంతో గ్రామ ప్రజలకు కొంతవరకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ లోబడే లాహు కుమార్ మాట్లాడుతూ, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఉపసర్పంచ్ చొరవను అభినందిస్తూ, సమస్యలను త్వరగా పరిష్కరించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు, ఇలాంటి నాయకులు గ్రామ అభివృద్ధికి చాలా అవసరం అని పలువురు యువకులు ఉప సర్పంచ్ ను అభినందించారు. గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్న నేనుంటానని ముందుండి పనులు చేయించే నాయకుడు దొరికినందుకు గ్రామస్థులు ఆనంద వ్యక్తం చెయ్యడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *