గ్రామీణులకు ‘శ్రీరక్ష ఆరోగ్య యాత్ర’… విజయవంతం

పయనించే సూర్యుడు మార్చి 22, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం పరిధిలో గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ‘శ్రీరక్ష ఆరోగ్య యాత్ర’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. డాక్టర్ జి.వి. గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఖమ్మం గాస్ట్రో హాస్పిటల్ (కే జి హెచ్) మరియు శ్రీరక్ష చారిటీ ఆర్గనైజేషన్ సంయుక్తంగా చేపట్టాయి.ఈ సందర్భంగా నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో గ్రామ ప్రజలకు లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఉచితంగా రక్త పరీక్షలు, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.వైద్యులు అవసరమైన సూచనలు అందించి ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాల్సిన విషయాలను వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, డాక్టర్ ఏడుకొండలు, డాక్టర్ సాత్విక్ పాల్గొని వైద్య సేవలు అందించారు. కార్యక్రమానికి చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు, ఉపసర్పంచ్ కోల ఉమారాణి, వార్డు సభ్యులు వేముల ఆకాష్, పొనుగోటి బాబు, గందశిరి లలిత, షేక్ రహ్మతుల్లా, కిలారు బాబూరావు, మాతంగి నాగరాజు, గ్రామ కార్యదర్శి రమేష్ బాబు, గ్రామ పెద్దలు, యువకులు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. గ్రామ ప్రజలు ఈ ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.