జహీరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఉజ్వల్‌రెడ్డి

పయనించే సూర్యుడు మార్చ్ 22(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) జహీరాబాద్: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణంలో శనివారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిడా౹౹చంద్రశేఖర్ , కాంగ్రెస్ పార్టీ నాయకుల డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రజలందరిలో సోదరభావాన్ని పెంపొందించాలని, కొత్త ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దైవ దీవెనలు జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మాజీ టీజీఐడీసీ అధ్యక్షులు మహ్మద్ తన్వీర్‌ను కలిసి వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వివిధ ముస్లిం సోదరుల నివాసాలకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యునూస్, వైస్ చైర్మన్ శిరీష సురేందర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు నాగిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ముల్తాని, సీనియర్ నాయకులు పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి, సభ్యులు ఖాజామియా, అరుణ్ కుమార్, జావిద్, జాఫర్, జహంగీర్, మహేష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు అశ్విన్ పాటిల్, మల్లికార్జున్, ప్రమోద్ కుమార్, సందీప్ కుమార్, పాండు యాదవ్, పవన్ మరియు ఇతరులు పాల్గొన్నారు.