డాక్టర్ జి.మనోహర్ రెడ్డి బిజెపికి పట్టిన దరిద్రం: మాజీ సర్పంచ్ కోడిగిరిబాబు .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 21 చండూరు మున్సిపాలిటీ పట్టణంలోనీ స్థానిక కస్తాల ఎక్స్ రోడ్డు ఆదివారం జరిగిన ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రుద్దడం పట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు తీవ్రంగా ఖండించారు. డాక్టర్ జి మనోహర్ రెడ్డి నియోజకవర్గ బిజెపికి పట్టిన దరిద్రమని మాజీ సర్పంచి కోడిగిరిబాబు విమర్శించారు. ఆయనకు ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు.బిజెపి నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు అంచులకు వచ్చారు అని గుర్తు చేశారు.గొడవకు కారణమైన దోటి కిరణ్ ఓ ఇసుక వ్యాపారి అని తుమ్మలపల్లి లో జరిగిన చిల్లర పంచాయతీని గొడవలు దాకా తీసుకువచ్చి పార్టీలకు రుద్ధాదని అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి గొడవలో లేని వారిని కూడా రిమాండ్ పంపించారని తెలిపారు. ఎదుటి వర్గానికి కూడా దెబ్బలు తగిలాయని కానీ పోలీసులు వారి ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు. దళితుడి పైన దాడి జరిగితే కనీసం పోలీసులు పిటిషన్ కూడా తీసుకోలేదు అన్నారు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరగకపోతే త్వరలోనే చండూరు బంద్ కు పిలుపునిస్తామన్నారు.