పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ మార్చి 21. నల్లగొండ గడియారం సెంటర్ వద్ద మండుటెండలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు శుక్రవారం నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధనకై స్థానిక మంత్రి కార్యాలయం ఇందిరా భవన్ ముట్టడికి యత్నించి అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం వెంటనే అమలు చేయాలన్నారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఆశాల అన్ని సమస్యల పరిష్కారానికి ఎన్‌హెచ్ఎం కింద తగిన నిధులు కేటాయించాలన్నారు. ఆశా వర్కర్లపై పెరుగుతున్న పనిభారం తగ్గించి, అదనపు భత్యాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఆశా వర్కర్లకు కూడా వర్తింపజేయాలని కోరారు.