నాడు దిరిశాల భద్రయ్య..నేడు గోవిందు శ్రీనివాసరావు..

★ కాంగ్రెస్ పార్టీలో అన్నారుగూడెంకు దక్కిన అరుదైన అవకాశం.. ★ డీసీసీ ప్రధాన కార్యదర్శిగా గోవిందు శ్రీనివాసరావు..

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 22, తల్లాడ రిపోర్టర్ ఖమ్మంజిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామం అంటే తెలియని వారు ఉండరు. రాజకీయంగా ఎంతోమంది ఉద్దండులకు పుట్టినిల్లు. కాంగ్రెస్ పార్టీలో గ్రామంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు పొందిన స్వర్గీయ దిరిశాల భద్రయ్య మాజీ కేంద్రమంత్రి గారపాటి రేణుక చౌదరి అనుచరుడుగా పనిచేశారు. గ్రామస్థాయి నుండి ప్రారంభమైన ఆయన ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ఆనాడు రాష్ట్రవ్యాప్తంగా భద్రయ్య పేరు మారుమోగింది. ఆయన అనుచరుడుగా గ్రామంలో పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రస్తుత తల్లాడ సొసైటీ మాజీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావుకు పార్టీలో సముచిత స్థానం దక్కింది. డీసీసీ ప్రధాన కార్యదర్శిగా గోవిందు శ్రీనువాసరావు.. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అన్నారుగూడెం గ్రామానికి చెందిన గోవిందు శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ జిల్లా కమిటీ అధికారికంగా ప్రకటించింది. చిన్ననాటి నుండి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయనకు ఆ పార్టీ అధిష్టానం మంచి పదవిని కట్టబెట్టింది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన తల్లాడ మండలంతో పాటు జిల్లాలో కూడా రాజకీయంగా అందరికీ తెలిసిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. రాజకీయంగా మంచి అవగాహన ఉన్న ఆయన.. ప్రసంగంలో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు కావడంతో జిల్లా నాయకత్వం ఆయనకు ఈ పదవికి ఎంపిక చేసింది. సమర్థవంతంగా పనిచేస్తా.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం సమర్థవంతంగా పనిచేస్తానని డీసీసీ ప్రధాన కార్యదర్శి గోవిందు శ్రీనివాసరావు తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి సహకరించిన సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, పార్టీ రాష్ట్ర నేత మట్టా దయానంద్ తోపాటు జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందే విధంగా అహర్నిశలు శ్రమిస్తానని పేర్కొన్నారు. తనకి ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, జిల్లా పార్టీ పెద్దలందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.